»Sensex Falls 862 Points October 26th 2023 And Nifty Also
Sensex: 860 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
భారత షేర్ మార్కెట్ అక్టోబరు 26న భారీ నష్టాలతో కొనసాగుతుంది. బేర్స్ దలాల్ స్ట్రీట్‌పై ఆధిపత్యం చెలాయించాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు అతిపెద్ద నష్టాలను మూటగట్టుకున్నాయి. BSE సెన్సెక్స్ ఒకనొకక్రమంలో 860, నిఫ్టీ 250 పాయింట్లు కోల్పోయింది.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) గురువారం(అక్టోబరు 26న) వరుసగా ఆరవ సెషన్లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో BSE సెన్సెక్స్ ఏకంగా ఒక దశలో 860 పాయింట్లు పతనమై 63,200కు చేరుకున్నాయి. ఇది జూన్ 26 నుంచి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు NSE నిఫ్టీ 250 పాయింట్లకు పైగా నష్టపోయి 18,881కి పడిపోయింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌లో టెక్ ఎం, ఎంఅండ్ఎం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ 1-3 శాతం క్షీణించాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్ గ్రీన్‌లో ఉన్నాయి. మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పడిపోయాయి. నిఫ్టీ రియాల్టీ నేతృత్వంలో అన్ని రంగాల సూచీలు 2.4 శాతం పడిపోయాయి. నిఫ్టీ పీఎస్‌బీలు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ 1 శాతానికి పైగా నష్టాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాందోళనల మధ్య ఈ మార్కెట్లు నష్టాల్లోకి మారినట్లు తెలుస్తోంది. దీంతోపాటు FII అమ్మకాలు, Q2 FY24 ఆదాయాలు ఊహించిన దాని కంటే బలహీనంగా ఉండటం కూడా భారతీయ ఈక్విటీలపై ప్రభావం చూపింది. మరోవైపు పెరుగుతున్న US బాండ్ ఈల్డ్‌లు, మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న రాజకీయ సంక్షోభం నుంచి దృష్టిని మరల్చడానికి చమురు ధరలలో తగ్గుదల ఉన్నప్పటికీ పెద్దగా మార్పు కనిపించలేదు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. ఈ ఘర్షణ చాలా కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉండగా..ఇది క్రమంగా ప్రపంచ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు.