Hero Sai Kumar: ‘సాయి కుమార్’ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు!
ప్రస్తుతం ఉన్న హీరోల్లో దాదాపు అందరూ స్టార్ వారసులే ఉన్నారు. నందమూరి, దగ్గుబాటి, అక్కినేని మరియు మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ అంతా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే సాయి కుమార్ వారసుడు కూడా హీరోగా ఉన్నాడు. ఇక ఇప్పుడు సాయికుమార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తుననాడు.
ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తునే ఉన్నారు. త్వరలోనే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ, రవితేజ వారసుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే చాలామంది సెలబ్రిటీస్ కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు. తాజాగా సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వస్తున్నాడు. ఇప్పటికే సాయి కుమార్ వారసత్వాన్ని అందుకొని హీరోగా రాణిస్తున్నాడు ఆది సాయి కుమార్. కానీ సరైన స్టార్డమ్ మాత్రం అందుకోలేకపోయాడు ఆది. అయినా వరుసగా సినిమాలు చేస్తునే ఉన్నాడు. ఇక ఇప్పుడు సాయికుమార్ బ్రదర్ రవిశంకర్ కుమారుడు హీరోగా లాంచ్ అవుతున్నాడు.
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్‌గా ‘బొమ్మాళి’ రవిశంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆ సినిమాకు ‘సుబ్రహ్మణ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో డివోషినల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అతని వాహనం నెమలిని చూపిస్తూ.. అనౌన్స్మెంట్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
అద్వయ్ ఖాకీ దుస్తులు ధరించి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో రహస్యంగా కనిపించే పుస్తకంతో స్టైలిష్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాజ్ తోట సినిమాటో గ్రాఫర్‌గా పని చేస్తుండగా, కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మరి అద్వయ్ హీరోగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.