సలార్ (Salar) డిసెంబర్ 22న వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి.. అక్టోబర్ 23 కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఎందుకంటే.. ప్రభాస్ (Prabhas) బర్త్ డే నాడు సాలిడ్ అప్డేట్ వస్తుందని.. ఖచ్చితంగా ట్రైలర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుందని ఆశగా ఎదురు చూశారు. అంతేకాదు.. ఇండియా(India)లో ఇప్పటి వరకు ఏ హీరోకి లేని విధంగా భారీ కటౌట్ ఏర్పాటు చేసి.. బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. కానీ ఎప్పటిలానే మళ్లీ డిసప్పాయింట్ చేశాడు ప్రశాంత్ నీల్.
పాత పోస్టర్లనే ఒక్క దగ్గరికి చేర్చి బర్త్ డే విషేష్ చేశారు హోంబలే ఫిలింస్ వారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neil) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అందుకే.. ఈ సమయంలో కొత్త అప్డేట్ బయటికి రాలేదని అంటున్నారు. కానీ మరోసారి సలార్ రిలీజ్ డేట్లో మార్పు జరగబోతోందనే న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడినా సలార్.. ఫైనల్‌గా డిసెంబర్ 22న వస్తుందని ఇటీవలె ప్రకటించారు. ఆ రోజు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘డంకీ’కి పోటీగా బరిలోకి దిగాలని ఫిక్స్ అయిపోయాడు సలార్. కానీ ఇప్పుడు మరో కొత్త డేట్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈసారి పోస్ట్‌పోన్ (Postpone) కాదట.. ప్రీ పోన్ అని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. డంకీ డిసెంబర్ 21న వస్తుందని చెబుతున్నారు. అందుకే.. సలార్ కూడా అదే డేట్‌కు రావాలి.. లేదంటే వారం ముందుకి ప్రీ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సలార్ డేట్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. షారుఖ్ ముందుకి, వెనక్కి వెళ్లిన కూడా.. సలార్ మాత్రం డిసెంబర్ 22న రావడం పక్కా అంటున్నారు. ఒకవేళ వారం రోజులు ముందుకి ప్రీ పోన్ (Prepon) అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.