»Madras High Court Gave A Huge Shock To Jayaprada Who Once Shone As A Heroine The Court Sentenced Her To 6 Months Imprisonment In The Esi Case When She Approached The Court To Cancel The Jail Senten
Jaya Prada: ఈఎస్ఐ కేసులో ప్రముఖ నటి జయప్రదకు షాక్
ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన జయప్రదకు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈఎస్ఐ కేసులో ఆమెకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షను రద్దు చేయమని ఆమె కోర్టును సంప్రదించగా.. ఆమెకు భారీ షాక్ ఇచ్చింది.
Jaya Prada: ప్రముఖ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద.. కార్మికుల నుంచి ఈఎస్ఐ డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. దీనిని రద్దు చేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో మద్రాసు హైకోర్టు ఆమెకు భారీ షాక్ ఇచ్చింది. 15 రోజుల్లోగా కోర్టులో వ్యక్తిగతంగా లొంగిపోతూ రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. చెన్నైలోని జనరల్ ప్యాటర్స్ రోడ్లో జయప్రదకు సొంత సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో జయప్రద ఈ థియేటర్‌ను నిర్వహించేవారు.
ఈ సినిమా థియేటర్లో పనిచేసే ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని జయప్రద చెల్లించలేదని ఓ ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జయప్రదపై చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు థియేటర్ నిర్వాహకులు జయప్రదతో పాటు ఇద్దరు భాగస్వామ్యులకు రూ.5000 జరిమానాతో పాటు ఆరు నెలల శిక్ష విధించింది. కానీ జైలు శిక్ష రద్దు చేయాలని జయప్రద మద్రాసు కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆమె జైలుకి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది.