టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తొలిసారి తన కూతురు క్లీంకారతో కలిసి తొలి విదేశీ ట్రిప్ ఇటలీకి ప్రయనమయ్యాడు.చరణ్ చేతుల్లో వారి పెట్ డాగ్ రైమ్, ఉపాసన (Upasana) ఒడిలో క్లీంకార ఉన్నారు. ఫొటోల్లో చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్ లో ఉన్నారు. అయితే తమ కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు ఉపాసన చూపించలేదు. బిజీ షూటింగ్ షెడ్యూల్ లో కూడా కుటుంబం కోసం కాస్త సమయాన్ని తీసుకుని ఇటలీకి పయనమయ్యాడు. ఈ ట్రిప్ కు ఎంతో ప్రత్యేకత ఉంది.
ఇది తన ముద్దుల తనయ క్లీంకార(Klinkara)కు తొలి ఫారిన్ ట్రిప్ కావడం గమనార్హం. విమానాశ్రయంలో వారు వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసిందన్న సంగతి తెలిసిందే. ఇక క్లీంకారతో కలిసి చిరంజీవి(Chiranjeevi)దిగిన ఫోటోలు, మనవరాలిని ఎత్తుకుని చిరు సంబరపోతూ ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. క్లీంకారను కామినేని (Kamineni) కుటుంబం నుంచి కొణిదెల ఇంటికి వచ్చిన తరుణంలో ఆహ్వానించిన తీరు, వినాయక చవితి నాడు ప్రత్యేక పూజలు చేయడం అందరికీ తెలిసిందే.
క్లీంకార కోసం వేదమంత్రాలు పఠించే వారిని తీసుకొచ్చి మరీ ఆహ్వానం పలికించాడు చిరు.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ (Game changer) సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ తరువాత వెంటనే బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశాడు. కానీ గేమ్ చేంజర్ ఆలస్యం అవుతుండటంతో చెర్రీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఈ మధ్య చెర్రీ ముంబై(Mumbai)కి వెళ్లడంతో అక్కడ రాజ్ కుమార్ హిరాణితో చర్చించాడని, వారిద్దరి కాంబోలో సినిమా ఉంటుందనే రూమర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.