»Fake Ed Raids At Delhi 3 2 Crore Robbery One Person Arrest
Fake ED raids: ఈడీ అధికారులమని దాడులు..రూ.3.2 కోట్ల దోపిడీ
ఇటివల కాలంలో ఫేక్ ఐటీ, ఫేక్ ఈడీ అధికారుల పేరుతో చేస్తున్న దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో చెన్నైలో ఐడీ రైడ్స్ పేరుతో సోదాలు చేసి పలువురు నగదు దోచుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఢిల్లీలో పేక్ ఈడీ అధికారులు ఓ ఇంట్లో దోపిడీ చేసి 3 కోట్ల రూపాయల నగదు దోచుకున్నారు.
fake ED raids at delhi 3.2 crore robbery one person arrest
పలువురు వ్యక్తులు ఈడీ అధికారులమని ఓ వ్యాపారి ఇంటికి వెళ్లారు. ఆ క్రమంలో నిజంగా వారిని నమ్మంచి రూ.3.2 కోట్ల నగదును దోచుకున్నారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.3.2 కోట్లను దోచుకున్నారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు దుండగుల్లో ఒకరిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.70 లక్షల నగదుతోపాటు ఓ కారు, పిస్తోల్ ను పోలీసు కంట్రోల్ రూమ్ (PCR) బృందం పట్టుకుంది.
ఈ కేసులో మరికొందరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే అసలు ఫేక్ అధికారులమని చెప్పి ఈ ఒక్క ఇంట్లోనే దోపిడీ చేశారా? లేదా ఇంకా ఎవరి ఇళ్లలోనైనా దాడి చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటివల కాలంలో ఫేక్ అధికారులమని చెప్పి దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతంలో కూడా నకిలీ ఐటీ అధికారుల పేరుతో పలు చోట్ల దాడులు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.