తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడింది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు (Police) విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా వాడపల్లి చెక్ పొస్టు వద్ద వాహనాల తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 75 కోట్ల నగదు, మద్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులో పోలీసు, రవాణాశాఖ (Transport Dept), కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, అటవీశాఖలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు(Check post) లతో పాటుగా.. ఆయా జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, మండల కేంద్రాల్లో నిత్యం నిర్వహిస్తున్న తనిఖీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ఎన్నికల కోడ్ (Election Code) కొనసాగుతున్నా కొందరు బేఖాతరు చేస్తున్నారు. యదేచ్ఛగా డబ్బులు తరలిస్తున్నారు.