»Chandrababus Illegal Arrest Will Be Held In Hyderabad Metro With A Black T Shirt
Chandrababu: హైదరాబాద్‌లో రేపు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి నిరసనలు చేయనున్నారు. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' అనే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు.
Chandrababu's illegal arrest will be held in Hyderabad Metro with a black T-shirt
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసనలు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఎంతోమంది స్పందించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ అనే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10:30-11:30 గంటల మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ నల్ల టీషర్ట్లు ధరించి మెట్రోలో ప్రయాణించనున్నారు. మెట్రో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఈ నిరసన చేయనున్నారు. మియాపూర్-ఎల్బీ నగర్ మధ్య వీలైనన్నీ స్టేషన్లలో నల్ల టీషర్టులు ధరించి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటు కావడానికి చంద్రబాబు ముఖ్య కారణమని, ఆయనకు మద్ధతుగా నిలిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహస్తున్నామని టీడీపీ నిర్వాహకులు తెలిపారు.