NTR: నందిగామలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వీల్చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, దివ్యాంగులకు ఉచిత వీల్చైర్లు అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయక పరికరాలు అందించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.