»Operation Ajay Programme Evacuation Of Indians From Israel Country
Operation Ajay: షురూ..ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఓ కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్ అజయ్ పేరుతో నేటి నుంచి అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపింది.
Operation Ajay programme Evacuation of Indians from Israel country
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి రావడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ అజయ్(Operation Ajay) కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం భారతీయ పౌరులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. తీవ్రమైన యుద్ధం జరుగుతున్న వేళ భారత పౌరులు తిరిగి స్వదేశానికి రావడానికి వీలుగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ అజయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(s jaishankar) తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ప్రత్యేక చార్టర్ విమానాలు(Special charter flights) ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.
Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.
Special charter flights and other arrangements being put in place.
Fully committed to the safety and well-being of our nationals abroad.
ఇండియా తిరిగి రావడానికి నమోదు చేసుకున్న భారతీయులను మొదటి ప్రత్యేక విమానంలో భారతదేశానికి పంపుతామని ఇజ్రాయెల్(Israel)లోని ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంఘర్షణ ప్రాంతాలలో ఉన్నారు. హమాస్ మద్దతుగల ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి పౌరులపై దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి నిష్క్రమించాలని కోరుకునే పర్యాటకులతో సహా భారతీయులు టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరి తమను భారత్ తీసుకెళ్లాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.