»Icc Odi World Cup 2023 Afghanistan Who Won The Toss Against Team India Choose Batting At Delhi
IndiaVsAfghanistan: భారత్‌పై టాస్ గెల్చిన ఆఫ్ఘన్..బ్యాటింగ్ కూడా
వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు ఆప్గానిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్గాన్ జట్టు ఇండియా టీంను ఓడించాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ పోరు జరుగుతోంది.
icc odi world cup 2023 Afghanistan who won the toss against team India choose batting at delhi
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు భారత్, ఆప్గానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. మొదట టాస్ గెల్చిన ఆప్గానిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగుతుంది. ఇక చెన్నైలో జరిగిన మొదటి మ్యాచులో తక్కువ స్కోర్ చేసినప్పటికీ విజయం సాధించిన భారత్..ఈ గేమ్‌లో కూడా గెలవాలని చూస్తోంది. మరోవైపు ఆప్గానిస్తాన్ బంగ్లాదేశ్‌పై ఓటమితో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ గేమ్ గెల్చి తిరిగి పుంజుకోవాలని ఆప్గాన్ ఆటగాళ్లు చూస్తున్నారు.
మంచు కురుస్తున్నందున సెకండ్ బ్యాటింగ్ చేయాలని చూస్తున్నామని అయితే వికెట్ల తీరులో పెద్దగా మార్పు ఉండదని.. ప్రత్యర్థిని పరిమితం చేయాలని చూస్తామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. చివరి గేమ్‌లో బ్యాట్‌తో ప్రారంభించడానికి కొంత ఒత్తిడిలో ఉన్నామన్నారు. అయితే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఆడిన విధానం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ రావడంతో వారు ఒక్కసారిగా మారారని పేర్కొన్నారు. ఇక ముందుగా బ్యాటింగ్ చేస్తామని ఆప్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ చెప్పాడు. ఇది మంచి బ్యాటింగ్ పీచ్ మాదిరిగా ఉందన్నారు. భారత్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద మంచి బౌలింగ్ ఉందని పేర్కొన్నాడు. బ్యాట్‌తో తిరిగి పుంజుకోవాలనుకుంటున్న వారిని కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
భారత జట్టు :రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వి), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్