పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సాలార్, కల్కి వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్, మారుతి చిత్రం గురించి క్రైజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ గురించి డైరెక్టర్ మారుతి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)మారుతీ(Maruthi) దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి తన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు. అంతేకాదు ప్రభాస్ క్యారెక్టర్ కోసం తన చిత్రంలో కొన్ని సీన్లకు డూప్‌ని కూడా వాడినట్లు చెప్పి అభిమానులకు షాకిచ్చాడు. త్వరలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ అఫీషియల్ స్టిల్ విడుదల కానుందని ఆయన ధృవీకరించారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సాలార్, కల్కి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ పవర్ ఫుల్ భారీ యాక్షన్ సినిమాలు. ఈ చిత్రాల్లో ప్రభాస్ పాత్ర, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ముందుగా ఈ చిత్రాల గురించి వేచి చూస్తున్నట్లు మారుతి చెప్పాడు. అవి పూర్తైన తర్వాత తన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే మారుతీ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర సరదాగా ఉంటుందని మారుతీ అన్నారు. అలాగే ఈ చిత్రానికి మూడు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే వాటిలో ఒకటి ఖరారు చేస్తామని చెప్పారు. మారుతి సినిమా కంటెంట్‌పై నమ్మకంగా ఉన్నాడు. ప్రతిదీ చాలా బాగా వస్తోందని, ప్రస్తుతం 50 శాతం షూటింగ్(shooting) చాలా పాజిటివ్ మోడ్‌లో జరిగిందని చెప్పాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2024లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.