»Another Month Time For Hero Nawazuddin Siddiquis Wife Aliya In Molestation Case
Molestation case:లో హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్యకు మరో ఛాన్స్
వేధింపుల కేసులో నవాజుద్దీన్ అతని కుటుంబసభ్యులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సిద్ధిఖీ భార్య అలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె తన సమాధానం చెప్పాలని కోర్టు మరో నెల సమయం ఇచ్చింది.
Another month time for hero Nawazuddin Siddiquis wife aliya in molestation case
బాలీవుడ్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui)తో విడిపోయిన ఆయన భార్య ఆలియా(aliya)కు అతని కుటుంబానికి చెందిన నలుగురిపై ఆమె దాఖలు చేసిన వేధింపుల కేసులో క్లిన్ చీట్ ఇవ్వడాన్ని ఆమె ఖండించింది. ఈ క్రమంలో ఆమెకు సమాధానం ఇవ్వడానికి ప్రత్యేక పోక్సో కోర్టు శనివారం మరోక నెల సమయం ఇచ్చింది. సెప్టెంబరు 19న జరిగిన చివరి విచారణలో పోలీసులు తుది నివేదికను దాఖలు చేసిన తర్వాత అక్టోబర్ 7న హాజరుకావాలని ఆలియాకు కోర్టు(court) నోటీసు జారీ చేసింది. ఆ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు సిద్ధిఖీ, అతని తల్లి మెహ్రూనిసా, సోదరులు ఫైజుద్దీన్, అయాజుద్దీన్, మినాజుద్దీన్లకు క్లీన్ చిట్ ఇచ్చింది.
దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా ప్రత్యేక న్యాయమూర్తి రితేష్ సచ్దేవా తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి అలియాకు ఒక నెల సమయం ఇచ్చారు. తదుపరి విచారణను నవంబర్ 7వ తేదీగా కోర్టు నిర్ణయించింది. వేధింపుల కేసులో ఐదుగురు నిందితులకు పోలీసులు(police) క్లీన్ చిట్ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది ప్రదీప్ బల్యాన్ గతంలో పిటిఐకి చెప్పారు. ప్రాసిక్యూషన్ ప్రకారం సిద్ధిఖీ సోదరుడు మినాజుద్దీన్ 2012లో మైనర్ కుటుంబ సభ్యుడిని వేధించాడని, ఇతరులు అతనికి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఆలియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ముంబైలో ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయబడింది. తరువాత 2020లో బుధానా పోలీస్ స్టేషన్కు మార్చబడింది.