Roshan Kanakala: హీరోగా యాంకర్ కొడుకు..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
టాలీవుడ్లో కొత్త హీరోల తెరంగేట్రం జోరుగా సాగుతోంది. టాప్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈమేరకు ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్వీట్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.
Roshan Kanakala: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా మెప్పిస్తూ.. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సుమ. యాంకరింగ్ చేస్తూ పలు సినిమాల్లో కూడా కనిపించింది. అయితే యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఆరంగ్రేటం చేయనున్నాడు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిర్మల కాన్వెంట్లో నటించాడు. క్షణం, కృష్ణ అండ్ లీల సినిమాలను డైరక్ట్ చేసిన రవికాంత్ దర్శకత్వంలో రోషన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి ‘బబుల్గమ్’ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా మానస చౌదరి హీరోయిన్గా పరిచయం కానున్నది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
Congratulations to you Roshan, on making your debut as an actor… Wishing you to make your own mark and make Rajeev and Suma garu proud. 🤗
నటుడిగా డెబ్యూ మూవీ చేస్తున్న రోషన్‌కు అభినందనలు తెలియజేశారు. ఇండస్ట్రీలో నీ సొంత ముద్రను వేస్తూ.. రాజీవ్, సుమ గర్వపడేలా ఎదగాలని ఆశిస్తున్నా. బబుల్గమ్ యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్’ అని రాజమౌళి ట్వీ ట్ చేశారు. దీంతో రోషన్‌కి చాలామంది ఆల్ ది బెస్ట్ తెలుపుతూ.. కామెంట్లు చేశారు. బబుల్గమ్ సినిమా ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండటంతో పాటు రొమాంటిక్‌గా కూడా ఉందని నెటిజన్లు కామెంట్లలో తెలిపారు. ఈ ఫస్ట్ లుక్‌లో రోషన్ హీరోయిన్ మానసను కౌగిలించుకుని.. బబుల్గమ్ ఊదాడు. ఈ పోస్టర్లో ఇదర్దు ట్రెండీగా ఉండటంతో పాటు అందంగా కూడా ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ లుక్కు నెటిజన్లు ఎలా ఫిదా అయ్యారో.. అలాగే సినిమా కూడా మంచి హిట్ అవుతుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.