Bigg Boss7: బిగ్ బాస్కే బాప్ శివాజీ..రెండో భార్య ఎవరంటే?
ఉల్టా పల్టా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతుంది. ప్రేక్షకులు ఉహించన లేనంతగా ఎలిమినేషన్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే బిగ్ బాస్ కూడా వివిధ రకాల గేమ్స్‌తో కంటెస్టెంట్స్‌ని షాక్‌కి గురి చేస్తుంది. అయితే తాజాగా శివాజీ తన రెండో భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Bigg Boss7: ఈ సీజన్లో మొదటి వారం కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్ బాస్ వివిధ రకాల గేమ్స్‌తో స్టార్ట్ చేశాడు. ఇందులో చివరి రౌండ్లో చిట్టి ఆయేగా టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో జంటలకు వాళ్ల ఫ్యామిలీ నుంచి లెటర్స్ వస్తాయి. జంటలో ఒకరు ఈ లెటర్‌ను త్యాగం చేయాలి. ఇలా చేసిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారు కాకుండానే ఎలిమినేట్ అవుతారు. శుభ శ్రీ-గౌతమ్, యూవర్-తేజ, సందీప్-అమర్, శివాజీ-ప్రశాంత్ నాలుగు జంటలు ఈ టాస్క్‌లో పాల్గొన్నాయి. శుభ తన లెటర్ని, కంటెండర్‌షిప్‌ను గౌతమ్‌కి త్యాగం చేస్తే, యూవర్ తేజకు, అమర్ సందీప్‌కు త్యాగం చేశాడు.
ఇక చివరిగా శివాజీ, ప్రశాంత్ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. మొదటిగా యాక్టివిటీ రూమ్‌లోకి శివాజీ వెళ్లగా.. బిగ్ బాస్ తనకి ఇష్టమైన కాఫీ, భార్య పంపిన లెటర్ ఉంటాయి. కాఫీని చూడగానే శివాజీకి చాలా ఎనర్జీ వస్తుంది. కాఫీ చూసిన వెంటనే శివాజీ బిగ్ బాస్‌కు థ్యాంక్స్ చెప్పి.. కాఫీ తాగడం మొదలుపెడతాడు. ఆ సమయంలో ప్రశాంత్ రావడంతో ఇంకా ఎమోషనల్ డ్రామాలేం వద్దు.. నీకు కెప్టెన్సీ ఇచ్చేద్దామనుకున్నా. కామన్ మ్యాన్‌గా ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎలా అయిన గెలవాల్సిందే. బిగ్ బాస్ నాకు కాఫీ ఇచ్చాడు. నువ్వు కంటెండర్ అవ్వు అని శివాజీ అన్నాడు. కాఫీ నా వీక్నెస్. ఒక్కమాటలో చెప్పాలంటే కాఫీ నా రెండో పెళ్లాం. ఈ లెటర్లో ఏముంటుందో నాకు తెలుసని చెప్పి.. తర్వాత లెటర్‌ను క్రష్ చేశాడు. ప్రశాంత్ ఇంకా తన లెటర్‌ను శివాజీకి చదవమని బిగ్ బాస్‌ను కోరుతాడు. కానీ బిగ్ బాస్ ఒప్పుకోకపోవడంతో శివాజీ భార్యకు వదిన నన్ను క్షమించు అని అడిగాడు. తర్వాత తన లెటర్ చదువుకుని ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు.