మేషం:
అన్ని పనులు చకచకా పూర్తవుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్త అందుతుంది. నిర్ణయాలు మార్చుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆంజనేయ దండకాన్ని పఠించండి.
వృషభం:
స్నేహితులతో కొంత సఖ్యతగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తప్పవు. బాధలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో సంతోషంగా గడిపి వారిని ఆనందపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉన్నా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. గణేషుడి దర్శనం చేసుకోండి.
మిథునం:
అనుకున్న విధంగానే నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చేయాల్సిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబీకులతో ఆలయాలు సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందినా వెళ్లలేకపోతారు. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కృష్ణ నామాలను జపించండి.
కర్కాటకం:
గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులు విజయాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కుటుంబీకులతో పాల్గొని దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. ఉద్యోగాలలో పైఅధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆదాయం బావుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సరస్వతి దేవిని ప్రార్థించండి.
సింహం:
కొత్తవారితో పరిచయాలు పెంచుకోకండి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఉన్నా దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. దిగులు చెందకండి. చాలా రోజుల తర్వాత సోదరులను కలుసుకోవడంతో మనసు తేలికవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది ఉన్నా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. సుబ్రమణ్యస్వామిని దర్శించుకోండి.
కన్య:
ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న రుణయత్నాలు ఇప్పటికి ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగి అనుకున్నవి జరిగినా కొంత నిరాశ అయితే ఉంటుంది. కానీ బాధపడకుండా ముందుకు సాగుతారు. ధనలాభం చేకూరుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి.
తుల:
కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అందరి దగ్గరి నుంచి గుడ్ న్యూసులు వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అప్పులు చేయకండి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. లక్ష్మీదేవికి పూజ చేయండి.
వృశ్చికం:
కొత్త పనులు చేపట్టి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరచవు. బావుంటాయి. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు విని మీరు కూడా వారికి శుభవార్తను చెబుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. బాధపడటం మాని ముందుకు అడుగులు వేస్తారు. నవగ్రహాల ప్రదక్షిణం చేయండి.
ధనుస్సు:
చేపట్టిన వ్యవహారాలు వెంటనే పూర్తవుతాయి. సంఘంలో గౌరవం పెరిగి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు బావుంటాయి. దైవదర్శనాలు చేసి అనుకున్నవి సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి సాఫీగా ముందుకు సాగిపోతారు. ఆనందంగా ఉంటారు. ఆదాయం బావుంటుంది. కష్టాలను ఓర్చుకుంటారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోండి.
మకరం:
కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ముఖ్యవ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబీకులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందినా వెళ్లలేకపోతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది. శివాలయాన్ని దర్శించుకోండి.
కుంభం:
కొత్తవ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి గుడ్న్యూస్ వింటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. అన్ని విషయాల్లో ముఖ్యనిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఆలయదర్శనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అంతా మంచే జరుగుతుంది. తులసి మొక్కకు పూజ చేయండి.
మీనం:
అనుకున్నవన్నీ జరుగుతాయి. సోదరులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నా వెళ్లలేకపోతారు. ధనప్రాప్తి కలుగుతుంది. వస్తులాభాలను పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉండవు. సహ ఉద్యోగులు మిమ్మల్ని అవమానాలు చేయాలని చూస్తుంటారు. మనసును శాంతంగా ఉంచుకోండి. నాగ దేవతను తలచుకోండి.