»Dominos Pizza Reduced Prices Of Its Large Veg And Non Veg Pizzas Check Latest Price Here
Dominos Pizza: పిజ్జా ప్రియులకు గుడ్ న్యూస్.. సగానికి సగం తగ్గిన డొమినోస్ పిజ్జా ధరలు
ప్రముఖ పిజ్జా చైన్ డొమినోస్ తన పెద్ద పిజ్జా శ్రేణి ధరను తగ్గించింది. కంపెనీ నాన్ వెజ్, వెజ్ కేటగిరీలు రెండింటిలోనూ పెద్ద పిజ్జాల రేట్లను సగానికి తగ్గించింది.
Dominos Pizza: ప్రముఖ పిజ్జా చైన్ డొమినోస్ తన పెద్ద పిజ్జా శ్రేణి ధరను తగ్గించింది. కంపెనీ నాన్ వెజ్, వెజ్ కేటగిరీలు రెండింటిలోనూ పెద్ద పిజ్జాల రేట్లను సగానికి తగ్గించింది. లార్జ్ వెజిటేరియన్ పిజ్జా ధర రూ.799 నుంచి రూ.499కి, నాన్ వెజ్ లార్జ్ పిజ్జా ధర రూ.919 నుంచి రూ.549కి తగ్గినట్లు సమాచారం. ఇటీవల అనేక చిన్న పిజ్జా బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. దీని కారణంగా డొమినోస పిజ్జాకు పోటీ పెరిగింది. దీని కారణంగా కంపెనీ తన పోటీదారులకు గట్టి షాక్ ఇచ్చేందుకు పిజ్జా ధరలను తగ్గించింది. పిజ్జా కొత్త రేట్లను తెలుసుకుందాం..
టోసిన్, దక్షిణ కొరియాకు చెందిన గోపిజ్జా, లియోస్ పిజ్జేరియా, మోజోపిజ్జా, ఓవెన్‌స్టోరీ, లా పినోజ్ వంటి చిన్న బ్రాండ్లు మార్కెట్లోని పిజ్జా విభాగంలోకి ప్రవేశించినందున పిజ్జా కంపెనీ డొమినోస్ తన పిజ్జా సెగ్మెంట్ రేట్లను మార్చింది. ఇవి తక్కువ రేట్లతో డొమినోస్‌తో పోటీ పడుతున్నాయి. చౌకధరల కారణంగా ప్రజలు వీటి నుంచి కొనుగోలు చేయడమే ఎక్కువ ప్రయోజనకరంగా భావిస్తున్నారు. ఈ చిన్న, స్థానిక బ్రాండ్లన్నీ భారతదేశంలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. మార్కెట్లో ఉండడానికే రేట్లు తగ్గించడం వెనుక కారణమని చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, డొమినోస్‌తో పాటు, బర్గర్ కింగ్, పిజ్జా హట్, KFC వంటి ప్రముఖ QSR బ్రాండ్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. చిన్న, స్థానిక వెంచర్ల వల్ల నష్టాల పాలవుతున్నారు. ధర తగ్గడానికి కారణం భారతీయ మార్కెట్లో పెరుగుతున్న పోటీ కారణమని అక్టోబర్ 4న ఓ నివేదిక పేర్కొంది.
QSR పరిశ్రమలో డొమినోస్ ఒక ప్రధాన ఆటగాడు. కంపెనీ తాజాగా లార్జ్ వెజ్ పిజ్జా ధరను రూ.799 నుంచి రూ.499కి తగ్గించింది. అదే సమయంలో నాన్ వెజ్ లార్జ్ పిజ్జా ధర రూ.919 నుంచి రూ.549కి తగ్గింది. దీంతో ఎక్కువ మంది కస్టమర్లు వస్తారని, మునుపటిలాగా డొమినోస్ పిజ్జాను కొనుగోలు చేస్తారని కంపెనీ అంచనా వేస్తోంది. యమ్ బ్రాండ్స్ యొక్క పిజ్జా హట్ ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. తన ‘ఫ్లేవర్ ఫన్’ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, కంపెనీ ఇప్పుడు దాని ధరను రూ.79కి తగ్గించింది, ఇది దాని మునుపటి ధర రూ.200 కంటే చాలా తక్కువ.