Singer Mangli : పెళ్లి పీటలు ఎక్కుతోన్న సింగర్ మంగ్లీ..!
తెలుగు ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ యాసలో ఆమె పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మొదట కేవలం తెలంగాణ యాసలో మాత్రమే ఆమె పాటలు పాడేది. ఆ క్రేజ్ తోనే ఆమెకు సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి.
సింగర్ మంగ్లీ సినిమాల్లో పాడిన అన్ని పాటాలు దాదాపు క్లిక్ అయ్యాయి. కాగా తాజాగా మంగ్లీ గురించి ఓ విషయం బయటకు వచ్చింది. దాని ప్రకారం ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందట. తన బావ తోనే ఆమె పెళ్లి జరుగుతోందని వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మంగ్లీ మాట్లాడుతూ.. ఓరి భగవంతుడా.. నాకు తెలియకుండానే నా పెళ్లి కూడా చేసేస్తున్నారా.. అంటూ తనదైన శైలిలో స్పందించింది. అంతేకాదు తన పెళ్లి విషయంలో క్లారిటీకూడా ఇచ్చింది. ‘నాకు పెళ్లి ఏంటి. ప్రెజెంట్ ఆ ఆలోచన ఏమి లేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. మా బావతో నేను ఏడడుగులు వేయబోతున్నాను అని రాసుకొస్తున్నారు కదా. నాకే తెలియని ఆ బావ ఎవరో కొంచెం నాకు కూడా చెబుతారా. అసలు ఈ పుకారు సృష్టించింది ఎవరు’ అంటూ వ్యాఖ్యానించింది.
ఆమె సినిమాల్లో పాటలు పాడటమే కాదు, పలు సినిమాల్లో కూడా నటించారు. కాగా, ఆమె తన విలక్షణమైన బంజారా వేషధారణకు , భారతదేశంలోని వివిధ పండుగలలో తెలంగాణ పాటల ప్రదర్శనలకు గుర్తింపు పొందారు. ‘బతుకమ్మ,’ ‘బోనాలు,’ ‘సంక్రాంతి,’ ‘సమ్మక్క సారక్క జాతర, వంటి ప్రత్యేక సందర్భాలలో అంకితమైన ఆమె వీడియో పాటలతో ఆమె ప్రజాదరణ పెరిగింది. ‘ ఆమెను సంగీత పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టింది. మరి, నిజమైన పెళ్లి వార్తను ఆమె తన అభిమానులకు ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి.