»Sexual Abuse Of 16 Children Accused Sentenced To 690 Years In Prison
America: 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులు..నిందితుడికి 690 ఏళ్ల జైలుశిక్ష!
ఓ వ్యక్తికి 690 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అతని వయసు 34 ఏళ్లు మాత్రమే. కానీ చేసిన నేరాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇంతకీ అతనేం చేశాడు? అన్ని సంవత్సరాల పాటు శిక్ష ఎందుకు పడనుందో తెలుసుకోండి.
ఓ వ్యక్తికి 690 ఏళ్ల జైలు శిక్ష (690 years imprisonment) పడనుంది. 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ వ్యక్తికి భారీ శిక్ష పడనుంది. ఈ దారుణ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడిన ఆ వ్యక్తి సుమారుగా 34 నేరాభియోగాల్లో దోషిగా తేలడంతో ఆ వ్యక్తికి సుమారు 690 ఏళ్ల జైలు శిక్ష పడనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే అతని శిక్షకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా కోర్టు (Court) వెల్లడించలేదు. నవంబర్ 17వ తేదిన కోర్టు శిక్షాకాలాన్ని వెల్లడించనుంది.
34 ఏళ్ల మాథ్యూ జాక్ జివిస్కీ (Matthew Jack ziwisky) ఓ డే కేర్ సెంటర్లో (Day Care Centre) పనిచేస్తున్నాడు. ఆ సెంటర్లోనే 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే ఆ కేసులో అతడిని దోషిగా తేల్చడంతో కోర్టు శిక్ష వేయనుంది. 16 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించడంతో పాటుగా ఓ అబ్బాయికి అసభ్యకర వీడియోలను చూపించినట్లుగా పలు ఆరోపణలున్నాయి.
ఈ కేసులో ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ తీర్పును వెల్లడిస్తూ..మొత్తంగా 34 నేరాల్లో ఆ వ్యక్తి దోషిగా రుజువైనట్లు తెలిపారు. తన లైంగిక కోరికలు తీర్చుకునేందుకే మగ పిల్లల్ని తీవ్రంగా వేధించినట్లు మాథ్యూపై ఆరోపణలు నిజమేనని అన్నారు. అన్ని కేసులకు కలిపితే ఆ వ్యక్తికి సుమారు 690 ఏళ్ల పాటు జైలు శిక్ష (690 years imprisonment) పడనుందని పోలీసులు చెబుతున్నారు. అయితే శిక్షాకాలాన్ని మాత్రం నవంబర్ 17న కోర్టు వెల్లడించనుంది.