»Mexico Church 10 People Died After The Roof Of The Church Collapsed 60 People Are In Critical Condition
Mexico Church: చర్చ్ పైకప్పు కూలి 10 మంది దుర్మరణం.. 60 మంది పరిస్థితి విషమం!
చర్చి పైకప్పు కూలిపోవడంతో 10 మంది దుర్మరణం చెందిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 60 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో 30 మంది ఉండటంతో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మెక్సికో (Mexico)లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చర్చ్ పైకప్పు కూలడంతో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 60 మంది తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. తామౌలిపాస్ రాష్ట్రంలోని సియుడాడ్ మదెరో నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం గాయాలపాలైన ఆ 60 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
శాంటాక్రూజ్ చర్చ్ (Santa Cruz parish) అనేది స్థానికంగా చాలా ఫేమస్. ఆ చర్చిలో 100 మందికి పైగా ప్రార్థనల్లో పాల్గొంటూ ఉంటారు. ఆదివారం కూడా చాలా మంది చర్చికి తరలివచ్చారు. ప్రార్థనలు చేస్తుండగా ఒక్కసారిగా చర్చి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 10 మంది తమ ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకూ ఈ ఘటనలో 60 మంది తీవ్రంగా గాయపడగా మరో 30 మంది శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చర్చ్‌లో అంతమంది చనిపోవడంతో ఆ ప్రదేశం మొత్తం కుటుంబీకుల రోదనలతో నిండిపోయింది.