»Best Award For India Indri Whiskey In Whiskeys Of The World
Indri Whiskey: విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ లో ఇండియా విస్కీకీ బెస్ట్ అవార్డ్
దేశంలోని విస్కీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విస్కీలలో స్థానం సంపాదించుకుంది. దీంతో విస్కీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Best Award for India Indri Whiskey in Whiskeys of the World
మీరు మద్యం విస్కీ ప్రియులా? అయితే ఈ న్యూస్ గురించి మీరు తప్పక తెల్సుకోవాల్సిందే. ఎందుకంటే మన దేశంలో తయారైన ఇంద్రి విస్కీ(Indri Whiskey).. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఇన్ షో, డబుల్ గోల్డ్’ టైటిల్‌ను గెలుచుకుంది. దీపావళి కలెక్టర్ ఎడిషన్ 2023లో ప్రపంచంలోని అతిపెద్ద విస్కీ-టేస్టింగ్ పోటీలలో ఒకటైన ‘డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో’ అవార్డును ఇంద్రి సాధించింది. ఇందులో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 100 రకాలకుపైగా విస్కీలు పోటీపడతాయి. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్ కేటగిరీల వారీగా అనేక రౌండ్లలో రుచిని బట్టి ఎంపికచేస్తారు. ఆ క్రమంలో ఈ పరిశ్రమలోని కొంతమంది టాప్ టేస్ట్మేకర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్యానెల్ ప్రతి తరగతిలో ఒక విస్కీని అత్యుత్తమ విస్కీగా ప్రకటిస్తాయి. ఆ క్రమంలో భారతీయ సింగిల్ మాల్ట్ స్కాచ్ అయిన ఇంద్రి విస్కీ..బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్లతో సహా వందలాది అంతర్జాతీయ బ్రాండ్లను ఓడించింది.
హర్యానాలోని పిక్కడిల్లీ డిస్టిలరీస్ స్వదేశీ బ్రాండ్ అయిన ఇంద్రి తన ప్రయాణాన్ని ఇంద్రి-ట్రిని అని పిలవబడే మొదటి ట్రిపుల్-బ్యారెల్ సింగిల్ మాల్ట్‌తో 2021లో ప్రారంభించింది. గత రెండేళ్లలో ఇది 14 కంటే ఎక్కువ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ ప్రత్యేకమైన విస్కీ తయారీని ఉత్తర భారతదేశంలోని ఉపఉష్ణమండల వాతావరణంలో షెర్రీ క్యాస్లలో పరిపక్వత ఆధారంగా తయారు చేస్తారు. పొగ, క్యాండీడ్ డ్రైఫ్రూట్స్, కాల్చిన గింజలు, సూక్ష్మ సుగంధ ద్రవ్యాలు, ఓక్, బిటర్స్వీట్ చాక్లెట్ వంటి పలు రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. ఇంద్రి ట్రిని ఇప్పటికే భారతదేశంలోని 19 రాష్ట్రాలు, 17 ఇతర దేశాలలో కూడా అందుబాటులో ఉంది. నవంబర్ నుంచి US, ఎంపిక చేసిన యూరోపియన్ దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ విజయం తమ నాణ్యత, పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని ఇంద్రి విస్కీ నిర్వహకులు అంటున్నారు.