అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) మూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎస్పీ కేవీ సత్యనారాయణ(DSP KV Satyanarayana), సీఐ ఈశ్వరరావు అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు.పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో స్థానికంగా కలకలం రేగింది. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు సెంటర్, విద్యుత్ సబ్ స్టేషన్ సెంటర్, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇతరులెవ్వరూ రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంపై టీడీపీ శ్రేణులు (TDP ranges) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి పోలీసులు రావాల్సిన అవసరం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నించారు.ఇటీవల మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు (CI Iswara Rao) భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్సీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలివెళ్లారు. పరిసర గ్రామాలకు చెందిన మహిళలు కూడా వెళ్లారు. వారిని పోలీసుల ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.పరవాడ డీఎస్పీ ,సీఐ అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు (Police) బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. బండారుకు 41ఏ నోటీసు జారీ చేసి స్టేషన్కు తీసుకెళ్లాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలివచ్చారు.