బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలున్నాయి. వాటిలో బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత.. మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ కూడా ‘సలార్’ కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. ప్రభాస్ రేంజ్ తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయిపోయింది. తాజాగా సలార్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్. సలార్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది.. అంటూ ఒక నైట్ షూట్ కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక ఈ నెలాఖరు వరకు నాన్‌స్టాప్‌గా ప్రభాస్ సీన్లు షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌తో సలార్ షూటింగ్ దాదాపుగా పూర్తి కానుందని తెలుస్తోంది. దాంతో ఇప్పటికే ప్రకటించిన 2023 సెప్టెంబర్ 28న సలార్ విడుదల ఖాయమని చెప్పొచ్చు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాలున్న సలార్.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.