Balapur లడ్డూ ఈ సారి రూ.27 లక్షలు, 1994 నుంచి 2024 వరకు దక్కించుకుంది వీరే
బాలాపూర్ లడ్డూకు ఈ సారి రికార్డు ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రూ.24.60 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
Balapur: బాలాపూర్ (Balapur) లడ్డూకు (Laddu) మాములు క్రేజ్ ఉండదు. వేలంలో ఆ లడ్డూ దక్కించుకుంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఎంత డబ్బు పెట్టేందుకు అయినా వెనుకాడరు. 1994లో ప్రారంభమైన వేలం కొనసాగుతూ వస్తోంది. రూ.450 నుంచి క్రమంగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.24 లక్షలు దాటింది. బాలాపూర్ లడ్డూ వేలం పాట నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకోగా.. వేలం పాటపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సారి దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఊరేగింపు తర్వాత
బాలాపూర్‌లో గణేశుడి ఊరేగింపు కొనసాగుతోంది. ఇంటింటి దర్శనం అయిన తర్వాత వేలం పాటు ఉంటుంది. ఈ సారి వేలంలో 36 మంది పాల్గొంటున్నారు. వీరిలో ముగ్గురు బాలాపూర్‌కు చెందిన వారు ఉన్నారు. వేలం కన్నా ముందే ఇతర ప్రాంతాలకు చెందిన వారు రూ.25 లక్షల నగదును ఉత్సవ కమిటీకి అందజేశారని తెలిసింది. వేలం పాట తర్వాత వారు లడ్డూ సొంతం చేసుకోకుంటే కమిటీ తిరిగి డబ్బులను ఇచ్చేయనుంది.
కొలను హవా
1994లో కొలను మోహన్ రెడ్డి అన వ్యక్తి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. అతనికి మంచి జరగడంతో మరుసటి ఏడాది రూ.4500 సమర్పించారు. తర్వాత సంవత్సరం రూ.18 వేలం పాట పాడారు. 1997లో 28 వేలకు దక్కించుకున్నారు. 98లో 51 వేల పెట్టారు. అలా వరసగా ఐదేళ్లు ఆయనే దక్కించుకున్నారు. 1999లో కల్లెం అంజిరెడ్డి రూ.65 వేలకు దక్కించుకోగా.. 2000లో కల్లెం ప్రతాప్ రెడ్డి రూ.66 వేలు పెట్టారు. 2001లో రఘునందన్ చారి రూ.85 వేలు పెట్టగా.. 2002లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలు పలికారు. అప్పటినుంచి లక్షకు పైగా లడ్డూ పలుకుతుంది.
లక్షలు పలికిన లడ్డూ
2003లో చిగిరింత బాల్ రెడ్డి రూ.1.55 లక్షలు వేలం పాట పాటారు. 2004లో మళ్లీ కొలను మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సారి రూ.2.01 లక్షలకు దక్కించుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ అనే వ్యక్తి రూ.2.80 లక్షలకు.. 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలు దక్కించుకున్నారు. 2007లో రఘునందన్ చారి రూ.4.15 లక్షలు, 2008లో మళ్లీ కొలను మోహన్ రెడ్డి వచ్చారు. ఈ సారి రూ.5.07 లక్షలు ఇచ్చారు. 2009లో సరిత రూ.5.10 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
రూ.10 లక్షలు దాటి
2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ.5.35 లక్షలు, 2011లో కొలను బ్రదర్స్ రూ.5.45 లక్షలుకు దక్కించుకున్నారు. 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7.50 లక్షలు, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26 లక్షలు పెట్టారు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ.9.50 లక్షలు పెట్టారు. 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి రూ.10.32 లక్షలు పలికారు. 2016లో స్కైలాబ్ రెడ్డి రూ.14.65 లక్షలు పలికి.. లడ్డూకు ఉన్న క్రేజ్‌ను పెంచేశారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలు, 2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు వేటం పాట పాడారు. 2019లో కొలను రామిరెడ్డి రూ.17.60 లక్షలకు పెట్టారు. 2020లో కరోనా వల్ల సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
రూ.20 లక్షల పైచిలుకు
2021లో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మర్రి శశాంత్ రెడ్డి కలిసి రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. 2022లో బాలాపూర్‌కు చెందిన వంగెటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలు వేలం పాట పాడి దక్కించుకున్నారు. దాదాపు 5 లక్షల పైచిలుకు ఎక్కువ పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సారి దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి రూ.27 లక్షలకు వేలం పాడి స్వామి వారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు.