Sai Pallavi: కంగనా సినిమాలో సాయి పల్లవి నటించిందా..?
దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది.
సినీ ఇండస్ట్రీలో సాయిపల్లవి డ్యాన్స్‌కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సాయి పల్లవి ప్రేమమ్ మూవీతో తన కెరిర్‌ని మొదలుపెట్టిందని అందరూ అనుకున్నారు. కానీ దానికి ముందు సాయి పల్లవి కొన్ని చిన్నపాటి పాత్రలు కూడా చేసిందట. ఈ విషయం రీసెంట్ గా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదట ఆ పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారు. అయితే ఆమె నిరాకరించడంతో ఆ ఆఫర్ కంగనా చేతికి వెళ్లింది. ఈ క్రమంలోనే కంగనా హీరోయిన్గా నటించిన ఓ సినిమాలో సాయి పల్లవి చిన్న స్నేహితురాలి పాత్రలో నటించిందనే విషయం బయటకు వచ్చింది.
2008 భారతీయ తమిళ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధామ్ ధూమ్. దివంగత జీవా రచన, చిత్రీకరణ, దర్శకత్వం వహించారు. ఇందులో జయం రవి, కంగనా రనౌత్, లక్ష్మీ రాయ్, జయరామ్ నటించారు. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో కంగనా రనౌత్ అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సాయి పల్లవి షెన్బా (కంగనా) స్నేహితురాలిగా నటించింది. ఆమె, షెన్బా, మరొక స్నేహితురాలితో కలిసి వారి గ్రామంలో అశ్లీల సినిమా చూడటానికి వెళ్ళే సన్నివేశం ఉంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర అంతంత మాత్రమే. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ స్టేజ్ నుంచి సాయి పల్లవి ఈ స్టేజ్ కి వచ్చిందా అని ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.