MHBD: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మునిగల వీడు గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ చైతన్య నాగరాజు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను గ్రామంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గ్రామంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.