యూపీ లోని మథుర రైల్వే స్టేషన్(Mathura Railway Station)లో పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి పొద్దుపోయాక ఓ ట్రైన్ ఉన్నట్టుండి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. అయితే, అప్పటికే ప్రయాణికులు ప్లాట్‌ఫాం (Platform) లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మథుర స్టేషన్ డైరెక్టర్ ఎస్కే శ్రీవాస్తవ (SK Srivastava) కథనం ప్రకారం.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మథుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు (Passengers) దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంత ఎత్తున్న ప్లాట్‌ఫాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు (Investigate) చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్లకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు (Railway officials) ఆరా తీస్తున్నామని తెలిపారు.