ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ శ్రీలీల. అమ్మడి చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్‌తో కూడా ఛాన్స్ అందుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ మరో వైపు విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
Srileela: అసలు శ్రీలీల డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే.. వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఓకే చేసేసింది అమ్మడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలతోపాటు యంగ్ హీరోల సరసన కూడా రొమాన్స్ చేస్తోంది. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డేను పక్కకు పెట్టేసి మరీ శ్రీలీలకు మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. దీంతో అమ్మడికి మరింత డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో శ్రీలీల, విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిందనే న్యూస్ వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్గా ఫైనల్ అయింది. కానీ తాజాగా శ్రీలీల ఆ మూవీ నుంచి తప్పుకుందని టాక్.
డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల రౌడీ సినిమా నుంచి అవుట్ అయ్యిందట. ఈ ప్రాజెక్ట్‌తో పాటు మాస్ మహారాజ రవితేజతో చేయాల్సిన ఒక సినిమా నుంచి కూడా శ్రీలీల వెళ్లిపోయిందట. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఛాన్స్ అందుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. ఇక ఆ తర్వాత ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు డార్లింగ్. ‘సీతారామం’ క్లాసికల్ హిట్ అందుకున్న హను రాఘవూడి.. నెక్స్ట్ ప్రభాస్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ క్రేజి కాంబో వర్కౌట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ప్రభాస్ కోసమే అమ్మడు రౌడీకి హ్యాండ్ ఇచ్చిందా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. మరి దీని పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.