Manchu Manoj: రియాలిటీ గేమ్ షోకు హోస్ట్‌గా రాక్ స్టార్
గత ఐదారెళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు మంచు మనోజ్. ఇప్పుడిప్పుడు సినిమాలు చేస్తున్నారు. దాంతోపాటు ఈటీవీ విన్లో ఓ రియాలిటీ గేమ్ షో కూడా చేస్తున్నారు.
Manchu Manoj: ఐదారేళ్ల నుంచి మంచు మనోజ్ (Manchu Manoj) సినిమాలకు దూరంగా ఉన్నాడు. భార్యతో విడాకులు, మరో పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. తర్వాత అహం బ్రహ్మస్మి అనే మూవీ చేస్తున్నాడు. దీంతోపాటు వాట్ ది ఫిష్ మూవీ, రవితేజ, విశ్వక్ సేన్ కాంబోలో వచ్చే మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. సినిమాలు లైన్లో పెడుతూనే.. మరో వైపు ఓటీటీలో కూడా అలరించేందుకు రెడీ అయిపోయాడు. ఈటీవీకి చెందిన ఓటీటీ విన్లో ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను మంచు మనోజ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
కెమెరా ముందకు వచ్చి నమస్కరిస్తోన్న ఫోటో, ఓటీటీలో హోస్ట్‌గా చేసే ప్రోమో రెండు ఫోటోలను ఇన్ స్టలో మనోజ్ పోస్ట్ చేశారు. కళామతల్లి ముందుకు వచ్చానని మనోజ్ తెలిపారు. రియాలిటీ షోతో ప్రేక్షకులను అలరిస్తానని చెబుతున్నారు. దీనిని పీపుల్ మీడియా, ఈటీవీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తనదైన శైలిలో మనోజ్ నడిపిస్తారు. రియాలిటీ షోకు సంబంధించిన ప్రోమోలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.
తన ప్రపంచం సినిమా అని.. చిన్నప్పటి నుంచి సినిమా మీద ఉన్న అభిమానం, ప్రేమ.. వృత్తిగా మారింది. తనను నటుడిగా, హీరోగా చేసింది. రాకింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది. ఫ్యాన్స్ విజిల్స్, అరుపులు, కేకలు పండుగలా జరిగిన లైఫ్‌లోకి సడెన్‌గా సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడు.. కెరీర్ ఖతం అన్నారు. యాక్టింగ్ ఆపేశారు.. తిరిగి రారు అన్నారు. రాక్‌లో ఎనర్జీ లేదన్నారు. విన్నాను.. మౌనంగా భరించాను. తిరిగి వస్తున్నాను అని మనోజ్ వాయిస్ ఇచ్చారు.