ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీరి పెళ్లి వేడుకలు ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో మొదలయ్యాయి. దీంతోపాటు పలువురు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Parineeti Chopra and raghav chadha wedding Hungama started september 24th
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha)వివాహ వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ జంట సెప్టెంబర్ 22న వారి కుటుంబాలతో సహా ఉదయ్ పూర్ చేరుకున్నారు. సెప్టెంబర్ 23న హల్దీ, సంగీత కార్యక్రమాలను జరుపుకున్నారు. నేడు సెప్టెంబర్ 24న అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హోటల్ లీలాలో ఇప్పటికే అన్ని సన్నాహాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు సాయంత్రం 4 గంటలకు ఫెరాస్ (వివాహం) జరుగుతుంది. తరువాత సాయంత్రం లీలా ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడక నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు పలు కార్యక్రమాలు ముగుస్తాయి. అనంతరం రాత్రి 8:30 గంటలకు రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు. అతిథులకు స్వాగత భోజనం ఏర్పాటు చేశారు. మెనూలో ఆసియా, భారతీయ వంటకాలు ఉన్నాయి.
ఈ వివాహ వేడుక కార్యక్రమానికి సానియా మీర్జా, హర్భజన్ సింగ్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, ఆదిత్య థాకరేతో సహా చాలా మంది అతిథులు ఈరోజు వస్తారని భావిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వంటి పలువురు VIP అతిథులు కూడా ఇప్పటికే ఉదయ్ పూర్(udaipur) చేరుకున్నారు. ఇదిలా ఉండగా పరిణీతి కజిన్, నటి ప్రియాంక చోప్రా పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వధువుకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ వేడుకలకు ఆమె గైర్హాజరు కావడంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రిసెప్షన్ వేడుకకు వచ్చిన ప్రియాంక పెళ్లికి ఎందుకు రావడం లేదని చర్చించుకుంటున్నారు. వీరితోపాటు డిజైనర్ మల్హోత్రా, చిత్రనిర్మాత కరణ్ జోహార్ సహా పలువురు ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహ వేడుకలో సంగీత్ వేడుక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో DJ నవరాజ్ హన్స్బీట్లను అలపిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.