»Ambati Rambabu Counter To Balakrishna Ap Assembly 2023 Second Day
Ambati rambabu: బాలకృష్ణకు మరోసారి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కూడా మంత్రి అంబటి రాంబాబు, నందమూరి బాలకృష్ణ మధ్య సరికొత్త సంఘటన చోటుచేసుకుంది. బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన తెలుపగా..అంబటి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు ఏమన్నారో ఇప్పుడు చుద్దాం.
Ambati rambabu is once again a strong counter to Balakrishna ap assembly 2023 second day
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రెండో రోజు రసవత్తరంగా మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్ ఊదుతూ నిరసన తెలిపారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టగా స్పీకర్ చర్చ చేపట్టేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ చర్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గెలిచే పరిస్థితి లేదని అంబటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీకి రావడం కష్టమని, ఆ క్రమంలో ఇంటిదగ్గరే ఉండి విజిల్ ఊదుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుర్చిపై నిల్చుని అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అధ్యక్ష బజారులో ఊదుకోవాల్సిన విజిల్ ఇక్కడ చేస్తున్నారంటే శాసనసభను అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారని గుర్తు చేశారు. ఇది సరైనటువంటి విధానం కాదని అన్నారు. వారిమీద చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు అసలు వాస్తవాలు చెబితే చంద్రబాబు నాయుడి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారు రచ్చ చేసి బయటకు పోవాలని చూస్తున్నారు తప్ప ఇంకొకటి లేదన్నారు. మైక్ లేకపోయినా కూడా టీడీపీ సభ్యులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.