»Prime Minister Modi Is 73 Years Old September 27th 2023 Celebrities Who Have Birthday Wishes
HappyBdayModiJi: ప్రధాని మోడీకి నేటితో 73 ఏళ్లు..బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖులు
ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ముర్ము, హోమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఢిల్లీలో మెట్రో ప్రారంభం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Prime Minister Modi is 73 years old september 27th 2023 Celebrities who have birthday wishes
నేడు(సెప్టెంబర్ 17న) భారత ప్రధాని నరేంద్ర మోడీ(narendra modi) జన్మదినోత్సవం. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు బీజేపీ మోడీ పుట్టినరోజును వేడుకలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలతో సమాజంలోని వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు “సేవా పఖ్వారా”ను కూడా ప్రారంభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి ముర్ము(draupadi murmu) ట్విట్టర్ వేదికగా విషెస్ తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జీకి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, మీ అద్భుతమైన నాయకత్వంతో దేశప్రజలను ముందుకు తీసుకెళ్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మోడీని నవ భారత రూపశిల్పి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కొనియాడారు. దేశ ప్రాచీన వారసత్వం ఆధారంగా భారతదేశానికి బలమైన పునాది వేశారని అన్నారు. మోడీ జీ ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారని తెలియజేశారు. అటువంటి విశిష్ట నాయకుడి క్రింద దేశానికి సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు భారతీయ సంస్కృతి, ప్రపంచ ప్రతిష్ట, ప్రజల బహుముఖ అభివృద్ధి, పురోగతికి ప్రధాన మంత్రి స్పష్టమైన రూపాన్ని ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా(jp nadda) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు ప్రకటించారు. మోడీ భారతదేశానికి కొత్త గుర్తింపును మాత్రమే అందించలేదని, ప్రపంచంలోనే దాని ప్రతిష్టను పెంచారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(rajnath singh) అన్నారు. ప్రధాని భారతదేశ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళారని, ఆయనకు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. దీంతోపాటు సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు మోడీకి విషెస్ తెలియజేస్తున్నారు.
ఆదివారం నాడు ‘విశ్వకర్మ జయంతి’ కూడా కావడంతో “పిఎం విశ్వకర్మ(pm vishwakarma)”స్కీంను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయ నైపుణ్యాలలో నిమగ్నమైన కళాకారులకు సహాయం చేయడానికి ఉద్దేశించింది ఈ పథకం. ఈ స్కీంలో భాగంగా వెనుకబడిన తరగతుల కళాకారుల కోసం రూ.13,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ద్వారకలో యశోభూమి పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) మొదటి దశను మోడీ ప్రారంభించారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వద్ద కొత్త మెట్రో స్టేషన్ వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ను కూడా ఆరంభించారు.