»Vijay Devarakonda Gave One Crore Rupees To Hundred Families
Vijay Devarakonda: వంద కుటుంబాలకు కోటి ఇచ్చిన రౌడీ హీరో!
రీసెంట్గా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంతోషాన్ని తనతో పాటు తన అభిమానులతో కూడా పంచుకోవాలని అనుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అందుకే వంద మందికి కోటి రూపాయలు ఇచ్చాడు.
Vijay Devarakonda gave one crore rupees to hundred families!
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్లోనే అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసింది. ముఖ్యంగా యుఎస్ఏ లో 1.8 మిలియన్ రాబట్టి.. ఓవర్సీస్ లో ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. అలాగే మిగతా ప్రాంతాల్లోను ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.
ఖుషి సక్సెస్‌లో భాగంగా.. 100 మంది కుటుంబాలను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున, కోటి రూపాయలు అందించాడు. ఖుషి వైజాగ్ సక్సెస్ మీట్ ఈవెంట్లో ఈ విషయాన్ని ప్రకటించిన రౌడీ.. ఆ రోజు వేదిక మీద చెప్పినట్లే.. ఇవాళ 100 మంది లక్కీ ఫ్యామిలీస్‌ను ఎంపికచేశాడు. ఆ లిస్టును సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్‌ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ వంద మంది లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం.