పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కేబినేట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. పలువురి శాఖలను ముఖ్యమంత్రి మార్చారు. ఆరుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. ఇంద్రానిల్ సేన్‌ను పర్యాటక శాఖ మంత్రిగా నియమించారు. పర్యాటక శాఖ మంత్రిగా బాబుల్ సుప్రియో(Babble suprio)ను.. ఆ శాఖల నుంచి తప్పించి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు కట్టబెట్టారు. అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌కు అదనంగా ఇండస్ట్రీయల్ రీకన్స్ట్రక్షన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలు అప్పజెప్పారు. ప్రదీప్ ముజాందర్కు అదనంగా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ శాఖను కేటాయించారు.
అరూప్ రాయ్‌ను సహకార మంత్రిత్వ శాఖ నుండి తొలగించి వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యానవన శాఖకు కేటాయించారు. మీడియ సమావేశంలో మమతా మాట్లాడుతూ, తన మేనల్లుడు టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)కి ఇడి సమన్లు పంపడం “ప్రతీకారం” తప్ప మరొకటి కాదని ఆమె అన్నారు.”ఇది రాజకీయ ప్రతీకారం. అభిషేక్ బెనర్జీని అనవసరంగా వేధిస్తున్నారు. ప్రతీకార ధోరణి ఉండకూడదు, అది కూడా బూమరాంగ్ కావచ్చు” అని బెనర్జీ అన్నారు. స్కూల్ ఉద్యోగాల కుంభకోణంలో అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది.
పశువుల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి గతంలో ఆయనకు ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసింది. బెంగాల్‌కు ఇవ్వాల్సిన ఎన్ఆర్ఇజిఎ నిధులను కూడా విడుదల చేయాలని టిఎంసి (TMC) అధిష్టానం కేంద్రాన్ని కోరింది. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు రోజుల క్రితం చంద్రబాబు(Chandrababu)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.