SDPT: మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం ఆడబిడ్డల ఆత్మగౌరవమైన నిలబెట్టు రేవంత్ రెడ్డి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు X వేదికగా అన్నారు. గజ్వేల్లో యూరియా కోసం వచ్చిన మహిళలు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకునే దుస్థితి తెచ్చినట్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు కొట్టుకునే వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం లో రైతులకు కన్నీరు తప్పడం లేదన్నారు.