ప్రకాశం: కనిగిరి పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణ ప్రజలు పిర్యాదు మేరకు పలు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ బాగా లేకపోవడంతో శుభ్రం చేయించారు. అనంతరం పట్టణ ప్రజలు చెత్త సైడు కాలువలో వేయవద్దన్నారు.