ఇక షారుఖ్ ఖాన్ పనైపోయింది.. అని అనుకున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు బాలీవుడ్ బాద్ షా. పటాన్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి.. జవాన్‌తో మరో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు.
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా, బాలీవుడ్ కింగ్ ఖాన్‌గా ఉన్న ఉన్న షారుఖ్ ఖాన్.. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. సరిగ్గా అయిదేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల కంబ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్లో కేవలం షారుఖ్‌కి మాత్రమే సాధ్యమైన కంబ్యాక్ ఇది. పఠాన్ సినిమా రాబట్టిన కలెక్షన్స్ దెబ్బకి షారుఖ్ పై కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నారు కింగ్ ఖాన్. రిలీజ్‌కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన జవాన్ సినిమా మొదటి రోజు 129 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రెండో రోజు కూడా వంద కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా జవాన్ సినిమాకు నార్త్ బెల్ట్‌లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో జవాన్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది జవాన్. బాలీవుడ్లో మొదటి రోజు 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేశాడు షారూఖ్ ఖాన్. బాద్షా కంబ్యాక్ ఫిల్మ్ పఠాన్ సినిమాకు మొదటి రోజు హిందీలో 55 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.
కానీ జవాన్.. పఠాన్ కంటే 10 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు చేసింది. దీంతో హిందీ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది జవాన్. రెండో స్థానంలో పఠాన్, మూడో స్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో వార్, ఐదో స్థానంలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలున్నాయి. ఇక నార్త్‌తో పాటు సౌత్ లో హిట్ టాక్ అందుకుంది జవాన్. మొత్తంగా రెండు రోజుల్లో 240 కోట్ల గ్రాస్ అందుకుంది జవాన్.