పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి. ఈ సినిమాల్లో ఓజి పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్టేడ్ వైరల్‌గా మారింది.
పవన్ ఓజి మూవీ థియేటర్లోకి వచ్చిన రోజు జరగబోయే రచ్చ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తున్న ఓజి గ్లింప్స్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఓజి గ్లింప్స్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓజి.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ముంబైతో పాటు ఇతర దేశాల్లోను షూటింగ్ జరుపుకుంటోంది. గత కొద్ది రోజులుగా థాయిలాండ్‌లో లొకేషన్స్ వేటలో ఉంది చిత్ర యూనిట్.
అయితే తాజాగా బ్యాంకాక్‌లో షూట్ స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూట్ 60వ రోజుకి చేరుకున్నట్టుగా ఓజి డిఓపి రవిచంద్రన్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా కన్ఫామ్ చేశారు. దీంతో ఓజి షూట్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది అనే చెప్పాలి. అయితే పవన్ ఓజి కోసం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతాడనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రీ ఎంట్రీ తర్వాత విదేశాల్లో పవన్ చేస్తున్న సినిమా ఇదే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రొఫైల్‌ని ‘బుక్ మై షో’ యాప్‌లో యాడ్ చేయగా.. నెంబర్ 1 ప్లేస్‌లోకి వచ్చేసింది.
ఈ వారం రిలీజ్ అయిన కొత్త సినిమాలు జవాన్, మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలను కూడా డామినేట్ చేస్తూ టాప్ ప్లేస్‌లోకి వచ్చేసి రికార్డు క్రియేట్ చేసింది ఓజి. రెండు రోజుల్లోనే ఈ చిత్రానికి ‘బుక్ మై షో’ యాప్‌లో 18 వేలకు పైగా ఇంట్రెస్ట్ లైక్స్ వచ్చాయి అంటే.. ఓజి హైప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఓవర్సీస్లో పవన్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా ఓజి రికార్డ్ క్రియేట్ చేసింది.