AP CID said skill development scam of Rs 550 crore worth was done by chandrababu
రూ.550 కోట్ల స్కాం జరిగిందని తెలిపిన ఏపీ సీఐడీ
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లో భాగంగా వెల్లడి
ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షేల్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారని ప్రకటన
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి
ఈ కేసులో 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడి
ఈ మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీం పనిచేస్తుందన్నారు
ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.3,356 కోట్లలో 10 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని ఎంఓయూ నిర్దేశించింది
రూ. 371 కోట్ల కుంభకోణానికి చంద్రబాబు నాయుడు పక్కాగా ప్లాన్ చేశారన్న సీఐడీ
సీమెన్స్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి నిధులను పెట్టుబడి పెట్టనప్పటికీ, కేవలం మూడు నెలల్లోనే ఐదు విడతలుగా రూ.371 కోట్లు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ముసుగులో రూ.371 కోట్ల కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సూత్రధారిగా ఉన్నాడని ఆధారాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు