SalmanKhan: టైగర్-3 మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ ప్రకటించారు. టైగర్-3 మూవీ హిందీతోపాటు తెలుగు, తమిళ్, మాళయాళంలో మూవీ రానుంది. టైగర్-3 మూవీని ఆదిత్య చోప్రా నిర్మించగా.. మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్కు జోడిగా కత్రినా కైఫ్ నటించారు. ఇమ్రాన్ హస్మి జోడి కట్టారు.
టైగర్3 మూవీని రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించారు. అదీ పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా దీపావళికి నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని తెలిపారు. ఎక్ థా టైగర్ మూవీ బాలీవుడ్లో స్పై యాక్షన్ సినిమాల పరంపర వర్కవుట్ అయ్యింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీ సీక్వెల్గా టైగర్ జిందా హై సినిమా వచ్చింది. అదీ ఎక్ థా టైగర్ కన్నా బంపర్ హిట్ కొట్టింది.