»Case Against Tv Journalists And Anchors For Morphing Video Telecast Haryana Gurugram Pocso Act 2013
2013 pocso case: మార్ఫింగ్ వీడియో ప్రసారం..టీవీ జర్నలిస్టులు, యాంకర్లపై కేసు
ఓ మైనర్ బాలిక వీడియోను అనైతికంగా మార్పింగ్ చేసి మీడియాలో ప్రసారం చేసినందుకు పలువురు జర్నలిస్టులు, యాంకర్లపై కేసులు నమోదయ్యాయి. హర్యానా గురుగ్రామ్(Gurugram)లోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
హర్యానాలోని గురుగ్రామ్(Gurugram)లోని ప్రత్యేక కోర్టు గతంలో 10 ఏళ్ల బాలిక, ఆమె కుటుంబ సభ్యుల మార్ఫ్డ్ వీడియోను ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు పలువురు యాంకర్లు, జర్నలిస్టులపై కేసు నమోదు చేశారు. మొత్తం 8 మంది జర్నలిస్టులపై అభియోగాలు నమోదయ్యాయి. వారిలో అజిత్ అంజుమ్, యాంకర్ ఎండీ సోహైల్, రిపోర్టర్ సునీల్ దత్ న్యూస్24తో పనిచేశారు. ఎడిటర్-ఇన్-చీఫ్ చౌరాసియా, యాంకర్లు త్రిపాఠి, రషీద్ హష్మీ, జోధ్‌పూర్ రిపోర్టర్ లలిత్ సింగ్ బద్గుర్జార్, నిర్మాత అభినవ్ రాజ్ ఉన్నారు. వీరిపై సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 469, 471 (ఫోర్జరీ) IPC కింద అభియోగాలు మోపారు. సెక్షన్లు 67B (పిల్లల గురించి ఆన్లైన్లో దుర్వినియోగం చేయడం), 67 (లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) IT చట్టం. POCSO చట్టం(2013 pocso act)లోని సెక్షన్లు 23 (మీడియా ద్వారా పిల్లల గుర్తింపును బహిర్గతం చేయడం), 13C (పిల్లల అసభ్యకరమైన లేదా అశ్లీల ప్రాతినిధ్యం) వంటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
స్వయం ప్రకటిత దైవమని ప్రకటించుకున్న ఆశారాం బాపుకు వ్యతిరేకంగా నవంబర్ 2022లో నమోదైన ఈ కేసులో దీపక్ చౌరాసియాపై గతంలో అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. ఎఫ్ఐఆర్(FIR)లో జర్నలిస్టులు దీపక్ చౌరాసియా, చిత్రా త్రిపాఠి ‘ఇండియా న్యూస్ టీవీ’, ‘న్యూస్ నేషన్’కి చెందిన మరికొందరు జర్నలిస్టులపై తన 10 ఏళ్ల మేనకోడలు వీడియోను వక్రీకరించి ప్రసారం చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వార్తా ఛానెళ్లు, జర్నలిస్టులు తన మేనకోడలిని అసభ్యకరంగా చూపించారని, తన భార్య శిల్పిని తప్పుగా చూపించారని తెలిపారు. కానీ దీపక్ చౌరాసియా తన 10 ఏళ్ల మేనకోడలుపై అత్యాచారం చేశాడని పిటిషనర్ ఆరోపించలేదు. అంతేకాదు ఎలక్ట్రానిక్ రికార్డును (వీడియో క్లిప్) ఫోర్జరీ చేసినందుకు కూడా వారిపై అభియోగాలు మోపబడ్డాయి. ఆ వీడియో ద్వారా ఆమె కుటుంబం ప్రతిష్టకు హాని కలిగించేలా ఉందని కోర్టు పేర్కొంది. ఆసారం బాపూజీ పరువు తీసేలా మైనర్ బాలిక వీడియోను అనైతికంగా తారుమారు చేశారని వెల్లడించారు.