మనుషుల మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న, కనీస రక్త సంబంధాల(blood relations)కు విలువ ఇవ్వకుండా, కన్న బిడ్డలు సైతం తల్లిదండ్రులు పట్టించుకోకుండా పోతున్న నేటి తరుణంలో పెంపుడు కుక్క (Pet dog) పై తన ప్రేమను వ్యక్తం చేశారు ఓ వ్యక్తి పెంపుడు జంతువులతో మనుషులకు ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని తమ ఫ్యామిలీ(Family)లో సభ్యుల్లో ఒకరిగా చూస్తారు. ఇక మానవత్వం కాస్త ఓవర్ లోడ్ అయినవారైతే.. వీధి జంతువులపై ఎమోషన్(Emotion)చూపిస్తుంటారు.
అయితే వీటి కోసం కొన్నిసార్లు పెద్ద పెద్ద రిస్కీ పనులు చేస్తుంటారు. ప్రాణాల్ని(Life) పణంగా పెట్టే సందర్భాలు కూడా లేకపోలేదు. తాజాగా అలాంటి ఒక ఘటనే జరిగింది. భగ్గున మండుతున్న ఇంట్లో చిక్కుకున్న తన కుక్క కోసం ఒక వ్యక్తి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. అగ్నిమాపక సిబ్బంది (Firefighters) అడ్డుకున్నా వినలేదు. అతడిని ఆపేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరుగు పరుగున నిప్పుల గుండంలోకి వెళ్లి కాసేపటికి తన కుక్కతో తిరిగి వచ్చాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.