»Raghavendra Rao Shared The Photo Of Akira Pawans Son At The American Film School
Akira Nandan: అమెరికా ఫిల్మ్ స్కూల్కు పవన్ తనయుడు..అకీరా ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు షేర్ చేసిన పోస్ట్ అకీరా సినిమాల్లోకి వస్తారనే వార్తను నిజం చేస్తోంది. ప్రస్తుతం అకీరాతో రాఘవేంద్రరావు ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ (Tollywood) హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power star pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతుంటాయి. ఆయన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. అయితే ఆయన తన తండ్రిలాగే సినిమాల్లోకి వస్తారా? లేకుంటే వేరే రంగంలోకి వెళ్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా వైరల్ అవుతోన్న ఓ వార్త అకీరా సినిమాల్లోకి వస్తాడని చెబుతోంది. అకీరా నందన్ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో (America Film school) జాయిన్ అయ్యాడు.
అకీరా ఫిల్మ్ స్కూల్లో చేరిన విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Director K.Raghavendra Rao) సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మధ్యనే నార్వేలోని స్టావెంజర్లో బాహుబలి సినిమా ప్రదర్శితం అయ్యింది. ఆ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి (Rajamouli), రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ వంటివారు వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
నాలుగో తరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నానని, తన మనవడు కార్తికేయ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరినట్లు రాఘవేంద్రరావు వెల్లడించారు. వాళ్లిద్దరితో కలిసి ఉన్న ఫోటోను రాఘవేంద్రరావు షేర్ చేశారు. అయితే కొంతసేపటికే ఆ ఫోటోను డిలీట్ చేసేశాడు. అప్పటికే కొందరు ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి తమ తమ ఖాతాల్లో పోస్టు చేయడంతో అదికాస్తా విపరీతంగా వైరల్ అవుతోంది. అకీరా ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్, సంగీతంలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే.