»Bro Movie Ott Streaming Date Fix On Netflix August 25th 2023
BRO మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడు ఇప్పుడు చుద్దాం.
BRO Movie OTT Streaming Date Fix on netflix august 25th 2023
స్టార్ హీరో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేసిన బ్రో(BRO) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది. ఆగస్టు 25, 2023 నుంచి Netflixలోస్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం జూలై 28, 2023న థియేట్రికల్‌గా విడుదలైంది. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందించబడింది. ఇది 2021లో తమిళ భాషా చిత్రం వినోదయ సీతం రిమేక్ మూవీ. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. అయితే ఇప్పటికే ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిందని గతంలో వార్తలు వచ్చాయి.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ లతో పాటు బ్రహ్మానందం, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, యువలక్ష్మి, అలీ రెజా, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు, పృధ్వి రాజ్, రోహిణి, సూర్య శ్రీనివాస్, ఊర్వశి రౌతేల నటించారు. బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకుడు. స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారు. నవీన్ నూలి ఎడిటర్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్. టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నివేదికల ప్రకారం బడ్జెట్(budget) రూ.120 కోట్ల వరకు అయినట్లు తెలిసింది.