»Pig Kidney Working For Over 30 Days In Human Body After Transplant
Pig kidney: మనిషికి పంది కిడ్నీ..!
కిడ్నీ రిప్లేస్ చేయడం కొత్త విషయం ఏమీ కాదు. చాలా మందికి కిడ్నీ పాడైతే, మరొకరి కిడ్నీ పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఒక మనిషికి పంది కిడ్నీపెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఆ కిడ్నీ సవ్యంగా పనిచేయడం గమనార్హం. వైద్య చరిత్రలోనే అరుదైన సంఘటన ఇది కావడం గమనార్హం. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి వైద్యులు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల రోజులుగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పని చేస్తుంది. న్యూయార్క్ కి చెందిన వైద్యులు ఈ ప్రయోగం చేపట్టారు.
జంతువుల అవయవాలు మనుషులకి సరిపోతాయా లేదా? వాటిని మానవ శరీరంలో పెడితే ఎలా పని చేస్తాయనే దాని మీద న్యూయార్క్ కి చెందిన వైద్యులు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రయోగం కూడా చేశారు. లాంగోన్ హెల్త్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీ పెట్టి ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది మానవ కిడ్నీ మాదిరిగానే చక్కగా పని చేస్తుంది. కిడ్నీ పెట్టి ఇప్పటికీ నెలరోజులు. ఒక విధంగా చెప్పాలంటే మనిషి కిడ్నీ కంటే ఇది మరింత మెరుగ్గా పని చేస్తుందని ఈ ఆపరేషన్ లో భాగమైన డాక్టర్ మోంట్ గోమేరీ వెల్లడించారు. జులై 14న ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. సదరు వ్యక్తి శరీరంలో పంది కిడ్నీ పెట్టగానే వెంటనే పని చేయడం ప్రారంభించింది.
న్యూయార్క్ కి చెందిన 57 ఏళ్ల మౌరిస్ మో అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతనికి ఆ పరిస్థితి రాక ముందే కుటుంబ సభ్యులకి తన బాడీనిన్ మెడికల్ ఎక్స్పర్మెంట్ కోసం ఉపయోగించడానికి దానం చేయమని చెప్పాడు. అందువల్ల అతడి శరీరాన్ని వైద్యులు ఈ విధంగా ఉపయోగించుకున్నారు. అతని శరీరంలోని పంది కిడ్నీ అమర్చి అది ఎలా పని చేస్తుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు రెండో నెల నడుస్తుందట. ఇంరా ఎన్ని రోజుల పాటు కిడ్నీ పని చేస్తుందనేది వైద్యులు పరిశీలించనున్నారు. జంతువుల ఆర్గాన్స్ మనిషికి అమర్చడం వల్ల ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.