»Over 60 People Died When The Boat Capsized Senegal Cape Verde
Boat capsized: పడవ బోల్తా 60 మంది మృతి..వారిలో పిల్లలు కూడా
100 మందితో ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న 60 మందికిపైగా మృతి చెందారు. అయితే వారంతా పేదరికం, యుద్ధ భయాల నేపథ్యంలో వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సెనెగల్ నుంచి ప్రయాణించిన పడవ(boat capsized) కేప్ వెర్డే(cape verde)లో కనిపించకుండాపోయింది.
60 people died when the boat capsized senegal cape verde
సెనెగల్(senegal)నుంచి ప్రయాణిస్తున్న పడవ కేప్ వెర్డే(cape verde) వద్ద బోల్తా పడడంతో 60 మందికి పైగా మరణించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) బుధవారం రాత్రి వెల్లడించింది. దాదాపు 100 మంది సెనెగల్, సియెర్రా లియోన్ నుంచి వచ్చిన వారు పడవలో ఉన్నారని తెలిపింది. వారిలో కనీసం 63 మంది శరణార్థులు మరణించినట్లు భావిస్తున్నారు. 38 మంది ప్రాణాలతో బయటపడిన వారిలో 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని IOM ప్రతినిధి చెప్పారు.
కేప్ వెర్డియన్ ద్వీపం సాల్ నుంచి 150 నాటికల్ మైళ్ల (277 కిలోమీటర్లు) దూరంలో పశ్చిమ ఆఫ్రికాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో పొడవైన చెక్కలు కనిపించాయని పోలీసులు చెబుతున్నారు. ఓడ మునిగిపోయిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. అయితే అది ఎలా మునిగిపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. ఓడను స్పానిష్ ఫిషింగ్ బోట్ గుర్తించింది. దీంతోపాటు ఇది కేప్ వెర్డియన్ అధికారులు(officers) క్షతగాత్రులను తరలించి సహాయక చర్యలు చేపడుతున్నారు.
అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియలేదని అంటున్నారు. పడవ జూలై 10న సెనెగల్ నుంచి 100 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే ప్రస్తుతానికి అత్యవసర సేవల సిబ్బంది ఏడుగురి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 56 మంది తప్పిపోయినట్లు భావిస్తున్నారు. పేదరికం, యుద్ధం నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఏటా వేలాది మంది శరణార్థులు, వలసదారులు ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని పలువురు అంటున్నారు. IOM గణాంకాల ప్రకారం 2022లో కానరీ దీవులను చేరుకోవడానికి ప్రయత్నించి కనీసం 559 మంది మరణించారు.