విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తాపడటంతో 12 మంది మిస్సయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు.
ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. పర్యాటకులందరూ తంజావూరు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.