»Spider Emerges From Woman S Ear In Scary Viral Video Watch
Spider: మహిళ చెవిలో దూరిన సాలీడు.. నీరు పోయగానే ఏం చేసిందంటే ?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆశ్చర్యకరమైన వీడియోలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు ఒకదానికి మించి మరొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియో '@ఓవర్‌టైమ్' అనే ఖాతాలో అప్లోడ్ చేయబడింది. ఆ మహిళ చెవిలోకి సాలీడు ప్రవేశించింది. దీంతో ఆ మహిళ నొప్పితో మూలుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
Spider: చాలా మందికి సాలీడు అంటే చాలా భయం. అది కనపడితే చాలు ఆమడ దూరం పరిగెత్తుతారు. ఈ ఎనిమిది కాళ్ల జీవి మన ఇళ్లల్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొన్ని సార్లు మనం ఊహించాని ప్రదేశాల్లోకి దూరి టెన్షన్ పెడుతుంటుంది. అలానే వృద్ధ మహిళలను ఇబ్బందికి గురిచేసింది ఓ సాలీడు. ప్రస్తుతం ఆ వృద్ధ మహిళ చెవిలో సాలీడు ప్రవేశించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. దీని తర్వాత జరిగిన సన్నివేశం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ వీడియో డాక్టర్ని సైతం ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆశ్చర్యకరమైన వీడియోలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు ఒకదానికి మించి మరొకటి వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వీడియో ‘@ఓవర్‌టైమ్’ అనే ఖాతాలో అప్లోడ్ చేయబడింది. ఆ మహిళ చెవిలోకి సాలీడు ప్రవేశించింది. దీంతో ఆ మహిళ నొప్పితో మూలుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆమె అరుస్తూ ఉంటుంది. డాక్టర్ ఆమె చెవిలోకి ఒక ద్రవాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. సాలీడు అకస్మాత్తుగా చెవి రంధ్రం నుండి బయటకు వచ్చి మహిళ మెడ, నోటిపై క్రాల్ చేయడం ప్రారంభిస్తుంది. దీనిని చూసిన ప్రజలు చలించిపోయారు. సాలీడును తమ పరిసరాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు. చెవిలోంచి స్పైడర్ బయటకు వచ్చిన వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, అది సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. దీనిపై నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.