»To Bring Down Tomato Prices Government Sold 36 5 Tonnes Of Tomato At 70 Rupee Price In Delhi On Saturday
Tomato Prices: పెరిగిన సాగు.. తక్కువ ధరకే దొరుకుతున్న టమాటాలు
ఈ వారం నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఢిల్లీలో కేవలం ఒక రోజు(శనివారం)లో 36.5 టన్నుల టమాటాలను విక్రయించింది. NCCF మొత్తం వారాంతంలో 60 టన్నుల టమాటాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నేపాల్ నుంచి 10 టన్నుల టమాటాలు తెప్పించారు.
Tomato Prices: టమాటా ప్రతి ఒక్కరి వంట గదిలో ముఖ్యమైన కూరగాయ. అయితే పెరుగుతున్న ధరల కారణంగా కొంతకాలంగా ఇది సామాన్య ప్రజల ప్లేట్ నుండి టమాటా తప్పిపోయింది. టమాటా ధరను నియంత్రించడానికి ప్రభుత్వం నిరంతరంగా NCCF కేంద్రాలలో తక్కువ ధరలకు అంటే కిలో 70 రూపాయలకు విక్రయిస్తోంది. ఈ వారం నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఢిల్లీలో కేవలం ఒక రోజు(శనివారం)లో 36.5 టన్నుల టమాటాలను విక్రయించింది. NCCF మొత్తం వారాంతంలో 60 టన్నుల టమాటాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నేపాల్ నుంచి 10 టన్నుల టమాటాలు తెప్పించారు.
గత రెండు మూడు నెలల్లో దేశంలో టమాటా ధర 1400 శాతం వరకు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో టమోటాలు కిలో రూ.140 నుండి రూ.400 వరకు రిటైల్ ధరకు విక్రయించబడ్డాయి. పెరుగుతున్న టమాటా ధరలను అరికట్టడానికి జూలై 14 నుంచి NCCF, NAFED వంటి దాని ఏజెన్సీల ద్వారా ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం టమాటాలను కిలోకు 70 నుండి 90 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. ప్రభుత్వం జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటాల ధరలు పడిపోతున్నాయి. శనివారం మాత్రమే ఢిల్లీ NCR ప్రాంతంలో మొత్తం 85 NCCF వ్యాన్ల ద్వారా ప్రభుత్వం టమాటాలను విక్రయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 15 వ్యాన్లు నోయిడాలోని అనేక ప్రాంతాలను కవర్ చేశాయి. ఇది కాకుండా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో నాఫెడ్, ఎన్సిసిఎఫ్ ద్వారా తక్కువ ధరకు టమాటాలు విక్రయిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో టమాటా హోల్సేల్ ధర కిలో రూ.70 నుండి రూ.80 వరకు ఉందని ప్రభుత్వం తెలియజేసింది. చిల్లరగా 80 నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కాన్పూర్లో హోల్సేల్ ధర కిలో రూ. 50 నుండి 60 వరకు, రిటైల్ ధర రూ. 80 నుండి 100 మధ్య ఉంది. వారణాసిలో టమాటాలు హోల్సేల్లో రూ.70 నుండి 80 వరకు, రిటైల్లో రూ.90 నుండి 100 మధ్య విక్రయిస్తున్నారు. జైపూర్లో హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.65 నుంచి 70 వరకు, రిటైల్లో కిలో రూ.90 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో హోల్ సేల్ మార్కెట్ లో 70 నుంచి 80 రూపాయలు, రిటైల్ మార్కెట్ లో కిలో 80 నుంచి 120 రూపాయలకు విక్రయిస్తున్నారు.