Raptadu MLA: చంద్రబాబు ఓ గజదొంగ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
తనకు రెండు వేల కోట్ల ఆస్తులున్నాయని నిరూపించాలన్నారు. అదే నిజమైతే అందులో 50కోట్లు ఇస్తే మొత్తం రాసిస్తానన్నారు. తన దగ్గర ఉందంటున్న రూ.1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు.
Raptadu MLA: చంద్రబాబు చేసిన ఆరోపణలపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదన్నారు. చంద్రబాబు శిలాఫలకాలు వేయడం తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచన లేదన్నారు. తనకు రెండు వేల కోట్ల ఆస్తులున్నాయని నిరూపించాలన్నారు. అదే నిజమైతే అందులో 50కోట్లు ఇస్తే మొత్తం రాసిస్తానన్నారు. తన దగ్గర ఉందంటున్న రూ.1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుకు తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. పాల డైరీలు, బోరు బావుల ద్వారా ప్రజలకు చేతనైనంత సేవ అందిస్తున్నామని.. చంద్రబాబు బెదిరింపులకు భయపడే వారెవరూ ఇక్కడ లేరన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. హెరిటేజ్ అడ్డం పెట్టుకుని రైతుల నుంచి రూ.25 వేల కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని మండిపడ్డారు. విజయ డెయిరీని చంపేసిన ఆర్థిక ఉగ్రవాది.. సహకార వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం గాడి తప్పిన సహకార వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ చక్కదిద్దుతున్నారన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అంతే కాకుండా చంద్రబాబు రైతుల రక్తాన్ని పీల్చిన రక్త పిశాచిగా అభివర్ణించాడు. అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా మార్చారని ఆరోపించారు. బినామీలతో చంద్రబాబు అమరావతిలో భూములు కొనిపించారు.. ఇళ్ల నిర్మాణం గురించి చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోందన్నారు.